Header Banner

రెండ్రోజుల్లో RBI నుంచి అదిరే శుభవార్త.. భారీగా తగ్గనున్న లోన్ EMIలు? ఈసారి 75 పాయింట్లు కోత..

  Fri Jun 06, 2025 16:08        Politics

బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి ఆర్బీఐ త్వరలోనే నూతన మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక సమాచారాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా, రెండున్నర లక్షల రూపాయల కంటే తక్కువ విలువైన బంగారు రుణాలకు సంబంధించి లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తిని ప్రస్తుతమున్న 75 శాతం నుంచి 85 శాతానికి పెంచనున్నట్లు మల్హోత్రా తెలిపారు. ఈ సవరించిన మార్గదర్శకాలను శుక్రవారం (జూన్ 6) సాయంత్రం గానీ, లేదా సోమవారం (జూన్ 9) గానీ విడుదల చేస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో తక్కువ మొత్తంలో బంగారంపై రుణం తీసుకునేవారికి ప్రయోజనం చేకూరనుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు శనివారం విడుదల! ఫలితాలు ఇలా తెలుసుకోండి..

 

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన సూచనల మేరకే ఆర్బీఐ మార్గదర్శకాలను సవరిస్తోంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేసే పసిడి రుణాల విషయంలో ఒకే రకమైన, స్పష్టమైన నియమ నిబంధనలు ఉండాలన్నది ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే రుణ గరిష్ఠ విలువ, తనఖా రుణం యొక్క తీరు, తిరిగి చెల్లించే పద్ధతులకు సంబంధించిన నియమాలతో కూడిన ముసాయిదా మార్గదర్శకాలను ఆర్బీఐ గతంలోనే జారీ చేసింది. తాజా మార్పులు ఈ ముసాయిదాను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది. ఆర్‌బీఐ గవర్నర్ నుంచి ఈ సానుకూల ప్రకటన వెలువడటంతో బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేసే సంస్థల షేర్లలో మంచి ఉత్తేజం కనిపించింది. మణప్పురం ఫైనాన్స్ షేర్లు సుమారు 3 శాతం మేర, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు సుమారు 5 శాతం మేర లాభపడ్డాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

 

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

 

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

 

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

 

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

 

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

 

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

 

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RBI #RBIguidelines #Goldloan #SanjayMalhotra #Loantovalueratio #LTVratio